రెంటచింతలలో గతంలో చోరీకి పాల్పడిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై నాగార్జున తెలిపారు. ఫిబ్రవరి 18న ఆదూరి ఇన్నారెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. 38 గ్రాముల బంగారం, రూ. 70 వేలు అపహరణకు గురైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గురజాల మండలంకు చెందిన చిన్న సైదారావు చోరీకి పాల్పడినట్లు పోలీసుల గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి, గురజాల కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించినట్లు తెలిపారు.