రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టైల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు ఎగువనున్న నాగార్జునసాగర్ నుంచి 75వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు ఎస్ఈ వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. ప్రాజెక్టుకు చెందిన నాలుగు గేట్లను రెండు మీటర్లు రెండు క్రస్ట్ గేట్లను 1. 5 మీటర్లు ఎత్తి 69, 000 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తూ రెండు యూనిట్లు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూన్నారు.