నడికూడి టూ మాచర్ల బైపాస్ పనులను రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్ వద్ద గురువారం మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. రైతుల భూములకు ప్రభుత్వం అందించాల్సిన నష్టపరిహారం గురించి అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.