వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం పల్నాడు జిల్లా రెంటచింతలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించేందుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామృష్ణారెడ్డి వస్తుండగా రెంటచింతల ఊరు బయట పోలీసులు నిలువరించారు. మీకు పర్మిషన్ లేదు మీరు ఊరిలోకి రావద్దు అన్నారు. దీంతో పిన్నెల్లి మేము ర్యాలీ చేయం, మైకు వాడకుండా విగ్రహానికి పూలదండ వేసి వెళ్తామన్న కూడా పోలీసులు ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక పిన్నెల్లి వెనుదిరిగారు.