తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందంటే ఒక ధైర్యం, ఒక భరోసా మన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఉంటుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు.