యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ట్రాఫిక్ నియమావళుల అమలు కోసం పోలీసులు ప్రత్యేకంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను అనధికారికంగా రవాణా చేస్తున్న ఐదు ట్రాన్స్‌పోర్టు వాహనాలను గుర్తించి, మోటారు వాహన చట్టం ప్రకారం ఆయా వాహనాలకు రూ. 3వేల జరిమానా విధించారు. ఎస్‌ఐ టి శివరామకృష్ణ మాట్లాడుతూ, ప్రయాణికుల ప్రాణాలను లెక్కచేయకుండా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు .