క్రీస్తు ఆలయాన్ని నిలబెట్టేందుకు అన్ని వర్గాల వారు కలిసికట్టుగా కృషి చేయడం అభినందనీయమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. గురువారం వెల్దుర్తి మండలం, మండాది ఎస్సీ కాలనీలో ఆంధ్రా ఇవాంజికల్ లూధరన్ నూతన క్రీస్తు మందిరం, కమిటీ హాల్ ను ఎమ్మెల్యే జూలకంటి ప్రారంభించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.