వెల్దుర్తి: వీరబ్రహ్మేంద్రులకు ఎమ్మెల్యే ఘన పూజలు

69చూసినవారు
వెల్దుర్తి: వీరబ్రహ్మేంద్రులకు ఎమ్మెల్యే ఘన పూజలు
వెల్దుర్తి మండల పరిధిలోని గంగలకుంట గ్రామంలో కొలువుతీరిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి తిరుణాల మహోత్సవం అంగరంగ వైభవంగా శనివారం జరిగింది. ఈ తిరుణాల మహోత్సవానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా స్వామివారిని జూలకంటి వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్