ఏపీ ప్రభుత్వం ఏడాది పాలనలో మాచర్ల నియోజకవర్గంలో సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ విజయోత్సవ సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో జూలకంటి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేయించి, పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ వరకు సాగిన ర్యాలీ అనంతరం అక్కడే మహిళ సమక్షంలో ఎమ్మెల్యే చేతుల మీదిగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు.