ప్రభుత్వం ఉత్తర్వులు జి. ఓ. ఎం. ఎస్. నం. 66, ఏప్రిల్ 10లో 24-25 ఆర్ధిక సంవత్సరం నాటికి పాత బకాయిలు చెల్లించని వారి కోసం ప్రభుత్వం వడ్డీ రాయితీ 50శాతం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వినుకొండ పట్టణ ప్రజలు 24-25 ఆర్థిక సంవత్సరం వరకు ఇంటి, ఖాళీ స్థల పన్నులు ఇంకనూ ఎవరైనా చెల్లించని వారు ఉంటే వారు ఏప్రిల్ 30లోపు ఏక మొత్తంగా చెల్లించి వడ్డీలో 50శాతం రాయితీ పొందవచ్చని మంగళవారం మున్సిపల్ కమిషనర్ తెలిపారు.