మాచర్ల పట్టణంలోని మైన్స్ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై జి. సంధ్యారాణి వ్యభిచార గృహంపై దాడి చేసి ఒక విటుడిని, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు గురువారం ఆమె తెలిపారు. వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్ఐ సంధ్యారాణి పేర్కొన్నారు.