మహిళ మెడలో నాంతాడు చోరీ జరిగిన సంఘటన మాచర్ల పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. మాచర్ల పట్టణంలోని 14వ వార్డుకు చెందిన పాల్వాయి సత్యవతి అదే వార్డులోని సాయిబాబా గుడికి వెళ్తుండగా వెనుకగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని నాంతాడు లాక్కొని పారిపోయారు. కాగా సత్యవతి నాంతాడు గట్టిగా పట్టుకోవడంతో చిన్న ముక్క ఆమె చేతిలో మిగిలిపోయింది.