మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో మెప్మా కార్యక్రమాలపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అనేక స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారన్నారు. కమిషనర్ వేణుబాబు, ఇన్ఛార్జి సీఎంఎం రాజశేఖర్ సిబ్బంది ఉన్నారు.