కార్మికుల సమస్యలని పరిష్కరించాలని వినతి

79చూసినవారు
కార్మికుల సమస్యలని పరిష్కరించాలని వినతి
కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం మంగళగిరిలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సిఐటియు సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాల వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక నిరంకుశ చట్టాలను రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్