అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మాంసం క్రయ విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని కమిషనర్ అలీం భాష హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాంసం, చేపలు విక్రయదారులు, హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు మాంసాహారం విక్రయాలు జరపరాదన్నారు. కాదని విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.