జగయ్యపేట బ్రాయిలర్ పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి

61చూసినవారు
జగయ్యపేట బ్రాయిలర్ పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి
గత రెండు రోజుల క్రితం జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బ్రాయిలర్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిని తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బూదవాడ గ్రామానికి చెందిన బాణవతి స్వామి (28) బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులు తరలించారు.

సంబంధిత పోస్ట్