మంగళగిరిలో బాలికపై అత్యాచారయత్నం

78చూసినవారు
మంగళగిరిలో బాలికపై అత్యాచారయత్నం
మంగళగిరిలో ఓ మైనర్ బాలికపై శనివారం అత్యాచారయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగళగిరి రత్నాల చెరువులో ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 సంవత్సరాల బాలికపై వెంకటేశ్వరరావు (54) అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా దిశా డీఎస్పీ కోటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్