మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై నులకపేట వద్ద ఓ కారు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.నులకపేట వినాయకుడి గుడి వద్ద మంగళగిరి నుంచి వస్తున్న కారు ఎదురుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని, సోడా బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి.