ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుమాక షెడ్యూల్ విడుదల

74చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుమాక షెడ్యూల్ విడుదల
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తాడేపల్లి పరిధి పెనుమాకలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులు పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఉదయం 5. 45కు ఉండవల్లి నివాసం నుండి పెనుమాక చేరుకుని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. అనంతరం ఉండవల్లి చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్