పెండింగ్ జీతాలు ఇవ్వడం లేదంటూ కార్పోరేషన్ కార్యాలయం ఎదుట క్లాప్ ఆటో డ్రైవర్ల నిర్వహిస్తున్న సమ్మె శనివారంతో 6వ రోజుకు చేరింది. తమ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ నేతలు చెంగయ్య, బాలాజీ, బుజ్జి డిమాండ్ చేశారు. రెండు నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని అలాగే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ శిబిరాన్ని ఎయిమ్స్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.