మంగళగిరి మండలం చినకాకానిలో మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేశ్ కు తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ. 5, 07, 296 మంజూరు చేయించారు. మంగళవారం టీడీపీ నేతలు బాధితురాలి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతోందని వారు అన్నారు.