మంగళగిరి పరిధి చినకాకాని హాయ్ ల్యాండ్ సమీపంలో గోడౌను పక్కన ఓనివాసగృహం పైన గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. రూరల్ ఎస్ ఐ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ మృతుని వయస్సు సుమారు 50 ఏళ్ళు ఉంటాయని, టీ షర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉన్నందున గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉందని, కావున మృతిని వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు.