మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కమిషనర్ అలీమ్ బాషా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడుతూ దేశాభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. అడిషనల్ కమిషనర్ శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మిపతిరావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.