మంగళగిరిలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఫైర్ సీఐ వై. వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఫైర్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గౌతమ్ బుద్ధ రోడ్, ఆటోనగర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. కరపత్రాలు పంపిణీ చేస్తూ, మంటల నివారణపై ప్రదర్శనలు చేశారు. గ్యాస్, విద్యుత్ భద్రతపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అగ్నిప్రమాద సమయంలో 101 లేదా మంగళగిరి ఫైర్ స్టేషన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.