ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ వాగ్ధానం నేరవేరేలా ఇంటర్ ఫలితాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ శనివారం ప్రకటించింది. వాగ్దానం నెరవేరేలా ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రికార్డులు సృష్టించాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు మొత్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకున్నా గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఆ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది.