సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ తాకిందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఇది చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మీడియా స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా, తాను చేయని వ్యాఖ్యలపై అరెస్టు చేశారన్నారు. కోర్టు తీర్పు ఈ కుట్రను బహిర్గతం చేసిందని విశ్లేషకులు అంటున్నారని జగన్ సామజిక మాధ్యమం ఎక్స్ ద్వాారా శుక్రవారం స్పందించారు.