డీజీపీని కలిసిన మంగళగిరి జనసేన ఇన్చార్జి

70చూసినవారు
డీజీపీని కలిసిన మంగళగిరి జనసేన ఇన్చార్జి
డీజీపీ ద్వారక తిరుమలరావుని జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా డీజీపీకి శాలువా కప్పి సత్కరించారు. సమర్థవంతమైన అధికారిగా పేరున్న తిరుమలరావును డీజీపీగా నియమించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో మునగపాటి మారుతీరావు, వాసా శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :