గర్భిణీ వైద్యసేవలకు జనసేన నేత సహాయం

80చూసినవారు
గర్భిణీ వైద్యసేవలకు జనసేన నేత సహాయం
మంగళగిరి పరిధి యర్రబాలెం గ్రామానికి చెందిన ధనలక్ష్మి 6నెలల గర్భిణి. కాగా ప్రమాదవశాత్తు క్రిందపడటంతో ఆమెకాలికి గాయమైంది. గర్భిణీ కావటంతో ఆపరేషన్ చేసే అవకాశం లేదని కాన్పు జరిగే వరకు ప్రతి రోజు రూ. 700 విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో స్పందించిన జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు బుధవారం ఆమె నివాసానికి వెళ్లి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్