మంగళగిరికి చెందిన టిడిపి కార్యకర్త మహ్మద్ ఆరిఫ్ కి యర్రబాలెంకి చెందిన సయ్యద్ ఆస్మాతో నిఖా జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి మంగళగిరి ఈద్గా షాదీఖానాలో వలీమా (విందు) ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందించి ఆశీర్వదించారు. నూతన వస్త్రాలు పెళ్లికానుకగా బహూకరించారు.