మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు మంత్రి లోకేష్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రిని ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో పాటు APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తనకు భారీ మెజారిటీ ఇచ్చిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీని పోరాడి నెరవేరుస్తున్నారు.