దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ఉభయ పార్టీలతో మాట్లాడి మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ పరిష్కరించారు. మంగళగిరి గ్రామీణ పరిధిలో 154 వివాదాస్పదమైన కేసులు లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచనల నేపథ్యంలో డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో సీఐ శ్రీనివాసరావు సహకారంతో పోలీస్ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపారు.