గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ర్యాగింగ్ కేసులో 13 మందిపై చర్యలు తీసుకున్నామని ఎయిమ్స్ అధికారి ప్రతివంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. విద్యార్థుల నుంచి క్షమాపణ లేఖలు తీసుకొని వారిని వసతి గృహం నుంచి బహిష్కరించామన్నారు. ఒక్కఒక్కరి నుంచి రూ. 25వేల చొప్పున జరిమానా కూడా విధించామని తెలిపారు. తమ వైపు విచారణ పూర్తయిందని ఇకపై పోలీసుల విచారణ మాత్రమే మిగిలి ఉందని వివరించారు.