మంగళగిరి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

75చూసినవారు
మంగళగిరి: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ఎలాంటి గొడవలకు, భూదందాలకు పాల్పడకూడదని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎలాంటి గొడవలకు, భూదందాలకు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, దౌర్జన్యాలకు, అసాంఘిక చర్యలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, పాల్పడకూడదని తెలిపారు.

సంబంధిత పోస్ట్