మంగళగిరి: నివాసాల మధ్యలోనే జంతువుల వ్యర్థాలు.!

59చూసినవారు
మంగళగిరి: నివాసాల మధ్యలోనే జంతువుల వ్యర్థాలు.!
మంగళగిరి బాప్టిస్టుపేటలో నివాస గృహాల మధ్య జంతువుల ఎముకలు వేస్తుండటం వల్ల తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఊరు బయట వేయాల్సిన ఈ వ్యర్థాలను ఇళ్ల మధ్య పడేయటం సరైన పని కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఈ విషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్