సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు ఆయా పోలీసు స్టేషన్లలో మంగళవారం ఫిర్యాదులు చేశారు. మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ కు స్థానిక పాత్రికేయులు సహా సాక్షి విలేకరులు ఫిర్యాదులు అందజేశారు. సాక్షి ఛానల్ డిబేట్లో జరిగిన ఒక సంఘటనను సాకుగా తీసుకుని సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.