మంగళగిరి: ఆటోమొబైల్ దుకాణం దగ్ధం ఘటనలో కేసు నమోదు

65చూసినవారు
మంగళగిరి: ఆటోమొబైల్ దుకాణం దగ్ధం ఘటనలో కేసు నమోదు
మంగళగిరి ఆటోనగర్ లోని ప్లాట్ నెంబర్ 93లో ఉన్న ఆటోమొబైల్ దుకాణాన్ని కొందరు దుండగులు తగలు పెట్టారని బాధితుడు షేక్ జానీ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రూ.2.5లక్షలు ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్