మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో శనివారం డీజీపీ ద్వారక తిరుమలరావు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల మేనేజర్లతో, జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు ప్రయాణమవుతున్న ప్రతి ఒక్క ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా వారి గమ్య స్థానాలకు సకాలంలో చేరేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.