తల్లికి వందనం పథకంపై వైఎస్సార్ సీపీ నేతల అసత్య ప్రచారం తగదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గత కొన్ని రోజులుగా తల్లికి వందనం పథకం అమలుపై అనేక రకాలుగా బురదజల్లుతున్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు.