ఏయూ ప్రపంచంలోనే టాప్ 100లో ఉండాలని సీఎం భావించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ విశాఖ వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్‌చార్జ్ వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే బయపడేటట్టు చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.