పిఠాపురం చిత్రాడలో ఈనెల 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని మంగళగిరి- తాడేపల్లి నగర జనసేన పార్టీ కార్యదర్శి తిరుమలశెట్టి మురళీ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళగిరిలో గురువారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఇప్పటికీ జరిగిన సభకు ఎన్నో ఆటంకాలు కల్పించినప్పటికీ విజయవంతం చేశారన్నారు.