కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం 14 రోజులు రిమాండ్ విధించింది. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో కొమ్మినేని నిన్న అరెస్టైన సంగతి తెలిసిందే. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. సాక్షి టీవీ ఛానెల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.