ఎయిమ్స్ ఆసుపత్రిలో మరింత వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. ఢిల్లీలో కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన, మంగళగిరి ఎయిమ్స్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సూచించారు. ట్రామా సెంటర్, క్యాన్సర్ కేర్, శాశ్వత క్రిటికల్ కేర్ విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికీ మాస్టర్ హెల్త్ చెకప్ సౌకర్యం కల్పించాలన్నారు.