ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన టీచర్లకు మంత్రి నారా లోకేశ్ ఆదివారం అభినందనలు తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, "తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. ప్రైవేటు పాఠశాలలకు పోటీనిచ్చేలా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేద్దాం. ప.గో. జిల్లాక చెందిన మధుబాబు, రాజేంద్రప్రసాద్, కరుణాకరరావులకు హ్యాట్సాఫ్" అన్నారు.