మంగళగిరి: ఆర్టీసీ డీఎం నిరంకుశ వైఖరిపై ధ్వజం

67చూసినవారు
మంగళగిరి: ఆర్టీసీ డీఎం నిరంకుశ వైఖరిపై ధ్వజం
ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో మేనేజర్ ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య విమర్శించారు. ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ మంగళగిరి డిపో సెక్రటరీ నాగేశ్వరరావు సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఆయనను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్