మంగళగిరి మెయిన్ బజార్ ప్రాంతం ఇరుకుగా ఉండటంతో వాహనాల సంఖ్యం కొంచెం పెరిగినా ఇబ్బందిగా ఉంటోందని స్థానికులు అంటున్నారు. పరస్పరంగా వచ్చే వాహనాల మధ్య ప్రజలు నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. సరుకు రవాణా వాహనాలకు, సమయపాలన లేకుండా నడపటం వల్ల ఉదయం నుండి సాయంత్రం వరకు రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలంటూ సోమవారం స్థానికులు కోరారు.