క్రెడిట్ కార్డులు వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్ వలన మోసపోయామంటూ అనేకమంది స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిపారు. అవగాహనతోనే క్రెడిట్ కార్డులు వాడాలన్నారు. మోసం జరిగితే బ్యాంకులు సైతం తమకు సంబంధం లేదని చేబుతున్నాయన్నారు. అవసరం లేకుంటే క్రెడిట్ కార్డు జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని అన్నారు.