మంగళగిరి నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక కమిటీ సమావేశం MTMC కార్యాలయంలో ఆదివారం జరిగింది. నియోజకవర్గ వనరుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు P4 బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు డా. రవికుమార్, స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.