ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీని గురువారం ఉదయం మంగళగిరి కొత్తపేటలో ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ హాజరై, ఎంటీఎంసీ కమిషనర్ అలీం భాష, టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ఆంజనేయకాలనీ, సాయినగర్ లో పెన్షన్ల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. అనురాధ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల నివాసాలకే వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.