వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలి: సీనియర్ జడ్జి

66చూసినవారు
ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు అన్నారు. గురువారం మంగళగిరి కోర్టు ప్రాంగణం నుండి హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జడ్జీలు, న్యాయవాదులు హెల్మెట్ లు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సీ. హెచ్ రామకృష్ణ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. సురేష్, బార్ అసోసియేషన్ సభ్యులు, ఎంవీఐ లు విజయసారధి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్