ఎన్ని కేసులు పెట్టినా జై జగన్ అంటా: నందిగం సురేశ్

69చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ తనను మళ్లీ బలి పశువును చేయాలని చూస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. గురువారం మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయన మాట్లాడారు. 2014 నుంచి టీడీపీ తనను వేధిస్తోందని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా జై జగన్ అంటూ నినాదాలు చేస్తూనే ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్